సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సంచలన పాత్రలో పాయల్ రాజ్ పుత్
- వచ్చే నెలలో మంచు విష్ణు 'ఓటర్'
- గోపీచంద్ దర్శకత్వంలో రవితేజ
* మంచు విష్ణు హీరోగా నటించిన 'ఓటర్' చిత్రం ఎట్టకేలకు విడుదలవుతోంది. రెండేళ్ల క్రితమే పూర్తయిన ఈ చిత్రం పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. తాజాగా సెన్సార్ కూడా పూర్తయింది. వచ్చే నెలలో దీనిని రిలీజ్ చేస్తున్నారు.
* ప్రస్తుతం 'డిస్కో రాజా' చిత్రంలో నటిస్తున్న రవితేజ మరో చిత్రాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తాడు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.