'సైరా' రిలీజ్ డేట్ దాదాపు ఖరారైపోయినట్టే!
- చిరంజీవి కథానాయకుడిగా 'సైరా'
- చిత్రీకరణ పరంగా చివరి దశకు
- అక్టోబర్ 2వ తేదీన విడుదల చేసే ఛాన్స్
చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం .. స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడిన కథ కావడం వలన అక్టోబర్ 2వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఈ కారణంగానే అక్టోబర్లో విడుదలకి ప్లాన్ చేసుకున్న ఇతర సినిమాలు, సంక్రాంతి వైపుకి వెళుతున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార కనిపించనున్న సంగతి తెలిసిందే.