'అభినేత్రి 2' నుంచి 'చక్కని పిల్ల' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
- 'అభినేత్రి' సీక్వెల్ గా 'అభినేత్రి 2'
- సంగీత దర్శకుడిగా సామ్ సీఎస్
- ఈ నెల 31న సినిమా రిలీజ్
తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు "చక్కని పిల్లా చక్కర బిళ్లా చిక్కని సోకుతో చంపొద్దే .. " అంటూ ఈ పాట సాగుతోంది. ఈ సాంగ్ మేకింగ్ షాట్స్ ను బట్టి ప్రభుదేవా - నందిత శ్వేతపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఫాస్టు బీట్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంది. గతంలో తెలుగులో వచ్చిన 'అభినేత్రి' ఇక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. మరి దానికి సీక్వెల్ గా వస్తోన్న 'అభినేత్రి 2' కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.