మా పార్టీ గెలుపు విషయంలో ఎలాంటి అనుమానం లేదు: మాగంటి రూప
- 110కి పైగా అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవబోతోంది
- కనీసం 15 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం
- టీడీపీకి జయం చేకూరాలని సుదర్శన హోమం చేశాం
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, 110కి పైగా అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవబోతోందని, అదేవిధంగా, కనీసం 15 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపు విషయంలో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. ఓటమి భయంతోనే ఈవీఎంలపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనడం కరెక్టు కాదని అన్నారు. ఈసారే కాదు, ఈవీఎంల తీరుపై గతంలో కూడా చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు.