ఆటో బోల్తా.. ఎంబీఏ విద్యార్థిని మృతి.. మరో ఆరుగురికి గాయాలు!
- ఆటో డ్రైవర్ సహా ఐదుగురితో బయల్దేరిన ఆటో
- మార్గమధ్యంలో ఆటో ఎక్కిన అశ్వని
- టెంకాయ చిప్పలు తగిలి పగిలిన అద్దం
ఆ పగిలిన టెంకాయ చిప్పలు వేగంగా ఆటో అద్దానికి తగలడంతో అద్దం పగిలింది. ఈ అనూహ్య పరిణామంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఆటోలోని వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన అనంతపురంలోని సర్వజనా ఆసుపత్రికి తరలించారు. అశ్వని పరిస్థితి విషమించడంతో నేడు ఆమె మృతి చెందింది. మిగిలిన ఆరుగురు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.