'ఇస్మార్ట్ శంకర్' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు
- షూటింగు దశలో 'ఇస్మార్ట్ శంకర్'
- ఈ నెల 15వ తేదీన టీజర్ విడుదల
- రామ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే
మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఫస్టు టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా పూరి శ్రమిస్తున్నట్టు చెబుతున్నారు. ఇటు హీరో హీరోయిన్లు .. అటు దర్శకనిర్మాతగా పూరి ఈ సినిమా సక్సెస్ పైనే ఆశలు పెట్టుకున్నారు.