ఆ ఇంట్లో 66 మంది ఓటర్లు.. కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల తంటాలు!
- రామ్ నరేశ్ది అతి పెద్ద ఉమ్మడి కుటుంబం
- మొత్తం 82 మంది కుటుంబ సభ్యులు
- ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు
- ఓటు వేయనున్న 8 మంది ముని మనవళ్లు
రేపు అలహాబాద్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రామ్ నరేశ్ కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు ఉంది. విశేషమేంటంటే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రామ్ నరేశ్ ముని మనవళ్లు 8 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరంతా ఒకే వ్యక్తికి ఓటేసే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఈ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు.