హీరోగా రంగంలోకి దిగిన ప్రముఖ నిర్మాత తనయుడు
- కాజల్ క్లాప్ తో మొదలైన 'మనుచరిత్ర'
- హీరోగా రాజ్ కందుకూరి తనయుడు
- కథానాయికగా మేఘా ఆకాశ్
నాయకా నాయికలపై కాజల్ క్లాప్ ఇవ్వగా .. సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి 'మనుచరిత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కాజల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.