‘టీవీ 9’ సీఈఓ పదవి నుంచి రవిప్రకాశ్ ను తప్పించాలని చూస్తే ఖబడ్దార్!: కేఏ పాల్ హెచ్చరిక
- అన్యాయం ఎవరికీ జరగకూడదు
- రవిప్రకాశ్ తో, టీవీ 9తో నేనున్నాను
- యాజమాన్యానికి, రవిప్రకాశ్ కు గొడవలుంటే పరిష్కరిస్తా
1999లో అమెరికాలో తన ఆర్గనైజేషన్ కు ఫౌండర్ ప్రెసిడెంట్ గా తనను ఆ పదవి నుంచి తీసేసిన సంఘటన గురించి ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత పోరాడి మళ్లీ తన పదవిని కాపాడుకున్నానని చెప్పారు. అందుకే, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని చెప్పారు. ‘టీవీ 9’ యాజమాన్యానికి, రవిప్రకాశ్ కు మధ్య ఏవైనా గొడవలుంటే వాటి పరిష్కారానికి అవసరమైతే తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.