మరో లవ్ స్టోరీతో రంగంలోకి దిగుతోన్న అఖిల్
- అఖిల్ నాల్గొవ సినిమాకి సన్నాహాలు
- వచ్చేనెల 2వ వారంలో రెగ్యులర్ షూటింగ్
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన పేరు వినిపిస్తోంది .. కానీ ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదట. త్వరలోనే హీరోయిన్ ఎవరనేది ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. లవ్ స్టోరీతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇంతవరకూ అఖిల్ చేసిన సినిమాలు అభిమానులను నిరాశ పరుస్తూ వచ్చాయి. అందువలన ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు.