ఐటీ దాడులపై స్పందించిన నిర్మాత దిల్ రాజు!
- రేపు విడుదల కానున్న మహర్షి
- ఒక్కరోజు ముందు ఐటీ దాడులు
- ఆఫీసు, ఇంటిలో రికార్డుల పరిశీలన
ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంపై ఆయన స్పందిస్తూ..‘ఐటీ దాడులు జరగడం అన్నది కామన్. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూనే ఉంటాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా, ప్రకాశ్ రాజ్, ప్రధాన పాత్రలో అల్లరి నరేశ్ నటించిన ఈ సినిమాను వంశీ పైడిపల్లి రూపొందించగా, దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.