'మహర్షి' రీమేక్ పై దృష్టిపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్
- ఈ నెల 9వ తేదీన 'మహర్షి' రిలీజ్
- భారీ హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్
- ఫలితంపై దృష్టిపెట్టిన విజయ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్ పై తమిళ స్టార్ హీరో విజయ్ దృష్టిపెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. గతంలో తెలుగులో మహేశ్ బాబు చేసిన 'పోకిరి' .. 'ఒక్కడు' సినిమాలు, తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమాలు ఆయనకి భారీ విజయాలను అందించాయి. దాంతో 'మహర్షి' సినిమా రీమేక్ పై విజయ్ దృష్టిపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. 'మహర్షి' ఫలితం ఎలా ఉంటుందో చూసుకుని విజయ్ రంగంలోకి దిగొచ్చని చెప్పుకుంటున్నారు.