యాక్షన్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్
- తిరు దర్శకత్వంలో గోపీచంద్
- యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే కథ
- కీలకపాత్రలో జరీన్ ఖాన్
కాస్త ఆలస్యంగానే ఆమె ఒక ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. గోపీచంద్ హీరోగా దర్శకుడు 'తిరు' ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన మెహ్రీన్ ను తీసుకున్నాడు. కథ .. తన పాత్ర నచ్చడం వలన, వెంటనే మెహ్రీన్ అంగీకరించినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి 'జరీన్ ఖాన్' ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.