మహేశ్ చేతులు చాచి హగ్ అడిగారు... గ్రేట్ మూమెంట్: దిల్ రాజు
- మూడు ప్రముఖ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన 'మహర్షి'
- బుధవారం రాత్రి వైభవంగా ప్రీ రిలీజ్ వేడుక
- 9వ తేదీన విడుదలకు సిద్ధం
ఏ హీరోతో అయినా తాను సన్నిహితంగా ఉంటానని, సినిమా షూటింగ్ చివరి రోజున అందరికీ హగ్ ఇవ్వడం తనకు అలవాటని గుర్తు చేసుకున్న దిల్ రాజు, 'మహర్షి' షూటింగ్ చివరి రోజున తాను అందరికీ హగ్ ఇచ్చి, మహేశ్ కు ఇవ్వాలా? వద్దా? అన్న ఆలోచనలో వెళుతుంటే, ఆయనే స్వయంగా చేతులు చాపి 'నాకు హగ్ ఇవ్వరా?' అని అడిగారని, అదో గ్రేట్ మూమెంటని అన్నారు.
'ఊపిరి' తరువాత వంశీ పైడిపల్లి ఈ కథను మహేశ్ వద్దకు తీసుకెళ్లారని, ఆపై మహేశ్ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు వంశీ కళ్లు చమర్చాయని అన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ను చూసి తనను తాను నియంత్రణలో ఉంచుకోలేకపోయానని, అంత అద్భుతంగా ఉందని చెప్పారు.