భార్యను హత మార్చేందుకు సినీ ఫక్కీలో స్కెచ్ వేసిన భర్త!
- కొంతకాలంగా భార్యతో విభేదాలు
- శ్రీలతను కారుతో ఢీకొట్టిన శివాజీ
- రిమ్స్ ఆసుపత్రికి తరలింపు
- పరారీలో నిందితుడు
నేటి ఉదయం శ్రీలత తన బాబాయి పిచ్చయ్య చౌదరితో బైక్ పై కలిసి టంగుటూరు వెళుతుండగా, తూర్పునాయుడుపాలెం గ్రామ సమీపంలో మాటు వేసి, తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీలత, పిచ్చయ్య చౌదరికి స్వల్ప గాయాలవడంతో వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు ఎస్సై హజరతయ్య తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.