ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో ఆయన కనిపిస్తాడట
- చరణ్ జోడీగా అలియా భట్
- ఎన్టీఆర్ రెండవ నాయికగా నిత్య
- కీలకమైన పాత్రలో సముద్రఖని
ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం తమిళ నట దర్శకుడు సముద్రఖనిని ఎంపిక చేసుకున్నారు. ఆయనను ఏ పాత్ర కోసం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ బాబాయ్ గా కనిపించనున్నాడని అంటున్నారు. అంటే కొమరం భీమ్ కి బాబాయ్ పాత్రను పోషించనున్నాడన్న మాట. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమనీ, అందుకే ఆయనను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలుకానుంది.