ద్విభాషా చిత్రానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
- సుధీర్ వర్మతో శర్వానంద్
- తదుపరి సినిమాగా '96' మూవీ రీమేక్
- ఏడాది చివర్లో సెట్స్ పైకి
ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా శర్వానంద్ లైన్లో పెట్టేసినట్టుగా సమాచారం. ఇది తమిళ .. తెలుగు భాషల్లో రూపొందే చిత్రమని చెబుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మితమయ్యే ఈ సినిమా ద్వారా ఒక నూతన దర్శకుడు పరిచయం కానున్నాడని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో వున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.