నా మాటలు బాధకలిగించాయని నయనతార అంటే క్షమాపణ చెబుతాను: నటుడు రాధారవి
- నయనతారపై నాకు అక్కసు లేదు
- నేను కూడా మంచి నటుడినే
- నా వ్యాఖ్యలని కొందరే తప్పుబట్టారు
తాజా ఇంటర్వ్యూలో రాధారవి ఈ విషయంపై స్పందించారు. "నయనతార కంటే ముందు నా కళ్లముందు చాలామంది ఎదిగారు. అలా ఎదిగిన వాళ్లలో ఎవరినీ ఎప్పుడూ నేను ఏమీ అనలేదు. నయనతార కంటే తక్కువ పారితోషికం తీసుకున్నంత మాత్రాన నేను మంచి నటుడిని కాకపోను. ఆమెపట్ల అక్కసు పెంచుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నయనతార విషయంలో నా వ్యాఖ్యలను కొంతమంది మాత్రమే తప్పుబట్టారు అంటే, మిగతావాళ్లు సమర్ధించినట్టే కదా. నా మాటలు తనకి బాధ కలిగించాయని నయనతార ఎక్కడా చెప్పలేదు .. అలా ఆమె అంటే మాత్రం క్షమాపణ చెబుతాను" అని అన్నారు.