స్టార్ హీరోయిన్ తో సమానంగా విజయశాంతి పారితోషికం!
- మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ
- కీలకమైన పాత్రలో విజయశాంతి
- చాలా గ్యాప్ తరువాత అంగీకరించిన సినిమా
మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతి అయితేనే బాగుంటారని భావించి ఆయన ఆమెను సంప్రదించి ఒప్పించడం జరిగింది. విజయశాంతికి గల క్రేజ్ తెలిసిందే గనుక, ఆమెకి పారితోషికంగా ఎంత ముడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం ఆమె 2 కోట్లు అడిగారనీ, కోటి నుంచి కోటిన్నర ఆమెకు ముట్టనుందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అంటే ఒక స్టార్ హీరోయిన్ తీసుకునేంత పారితోషికం విజయశాంతికి ముడుతోందన్న మాట.