'బిగ్ బాస్ 3'లో పార్టిసిపెంట్ గా ఉదయభాను .. భారీ పారితోషికం?
- 'బిగ్ బాస్ 3'కి సన్నాహాలు
- వ్యాఖ్యాతగా నాగార్జున
- హౌస్ లోకి క్రేజ్ వున్న ఆర్టిస్టులు
మంచి క్రేజ్ వున్న వారిని మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ జాబితాలో ఉదయభాను పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యాంకర్ గా .. నటిగా ఉదయభానుకు మంచి క్రేజ్ వుంది. అందువలన ఆమెను తీసుకున్నారని అంటున్నారు. ఎలిమినేట్ అయ్యేంతవరకూ రోజుకి 2 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పేసి నిర్వాహకులు ఆమెను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ సీజన్ లో అత్యధిక పారితోషికం తీసుకునేది ఆమెనేనని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.