టీఆర్ఎస్ పై హరీశ్ రావు తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయి: కేసీఆర్ సోదరుని కూతురు రమ్యారావు
- కేసీఆర్, టీఆర్ఎస్ కోసం హరీశ్ ఎంతో కష్టపడ్డాడు
- కొందరి వల్ల హరీశ్ ఇబ్బందులు పడుతున్నాడు
- వేధింపులు ఎక్కువైతే తిరుగుబాటు చేసే అవకాశం ఉంది
తనకు కానీ, హరీశ్ కు కానీ కేసీఆర్ అన్యాయం చేయరని, కానీ ఇతరుల వల్ల అన్యాయం జరిగే అవకాశం ఉందని... ఈ విషయం తనకు, హరీశ్ కు ఎప్పుడో తెలుసని రమ్యారావు చెప్పారు. తొలుత తనకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు హరీశ్ కు జరుగుతోందని అన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తానని హరీశ్ ఇప్పటికీ అంటున్నారని... కానీ, పార్టీలో వేధింపులు ఎక్కువైతే, తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.