రాహుల్ నామినేషన్ చెల్లుబాటవుతుంది: అమేథీ రిటర్నింగ్ అధికారి
- పేరు, పౌరసత్వం, విద్యార్హతపై అనుమానాలు
- ఇండిపెండెంట్ అభ్యర్థి ధ్రువ్లాల్ ఫిర్యాదు
- నేడు పరిశీలించి ఓకే చెప్పిన అధికారి
ఈ విషయమై స్పష్టత వచ్చే వరకూ రాహుల్ నామినేషన్ను స్వీకరించవద్దని ధ్రువ్ తరపు న్యాయవాది రిటర్నింగ్ అధికారిని కోరారు. దీంతో రిటర్నింగ్ అధికారి రాహుల్ నామినేషన్ పరిశీలనను ఈ రోజుకి వాయిదా వేశారు. నేడు అన్ని అంశాలను పరిశీలించిన ఎన్నికల సంఘం రాహుల్ నామినేషన్ను స్వీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.