కెన్యా అడవులకు శర్వానంద్
- తెలుగులోకి '96' రీమేక్
- మారిషస్ లో పూర్తయిన షూటింగ్
- కెన్యా అడవుల్లో 15 రోజుల షెడ్యూల్
శర్వానంద్ సరసన సమంత నటిస్తోన్న ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మారిషస్ లో ఒకటి రెండు రోజులు షూటింగు జరుపుకుని వచ్చింది. తాజా షెడ్యూల్ ను 'కెన్యా' అడవుల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా యూనిట్ అక్కడికి చేరుకోనుంది. 15 రోజుల పాటు అక్కడ ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమిళంలో మాదిరిగానే తెలుగులోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.