సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మారిషస్ లో సమంత పాట
- 'మహర్షి' షూటింగ్ పూర్తి
- తాజా షెడ్యూల్ లో 'వాల్మీకి'
* మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న 'మహర్షి' చిత్రం షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయింది. మే 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.
* వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారిగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న 'వాల్మీకి' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ పరిసరాల్లో 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ ను నిర్వహిస్తారు.