50 కోట్ల క్లబ్ లోకి చేరిన 'మజిలీ'
- చైతూకి హిట్ తెచ్చిపెట్టిన 'మజిలీ'
- కెరియర్లోనే అత్యధిక వసూళ్లు
- దివ్యాన్షకి మంచి మార్కులు
కొంతకాలంగా చైతూ సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అలాంటి హిట్ ఆయనకి ఈ సినిమాతో లభించడం విశేషం. చైతూ కెరియర్లో ఇంత త్వరగా అత్యధిక వసూళ్లను సాధించి .. 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన చిత్రంగా 'మజిలీ' నిలిచింది. ఇక ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైన దివ్యాన్షకి కూడా మంచి మార్కులు పడిపోయాయి. ఈ అమ్మాయికి ఇక్కడ వరుస అవకాశాలు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.