'మహర్షి' నుంచి 'నువ్వే సమస్తం' సాంగ్
- మహేశ్ బాబు 25వ మూవీగా 'మహర్షి'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- సాహిత్యం శ్రీమణి
"నువ్వే సమస్తం .. నువ్వే సిద్ధాంతం .. నువ్వే నీ పంతం .. నువ్వేలే అనంతం .. ప్రతి నిశి మసై .. నీలో కసై దిసై అడుగేసేయ్ మిస్సేయిలులా .. " అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సాంగ్ యూత్ ను .. మహేశ్ బాబు ఫ్యాన్స్ ను పట్టేసేదిలా వుంది. దిల్ రాజు .. అశ్వనీదత్ .. పీవీఆర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.