సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అర్థం చేసుకోవాలంటున్న తమన్నా
- బన్నీ సినిమాకి మ్యూజిక్ కంపోజిషన్
- నాగశౌర్య చిత్రం ఆగిపోయిందట!
* అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే చిత్రం కోసం మ్యూజిక్ సిటింగ్స్ మొదలయ్యాయి. సంగీత దర్శకుడు తమన్ సారథ్యంలో కంపోజిషన్ జరుగుతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ చిత్రానికి గీతాలు రాస్తున్నారు.
* యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడుగా నూతన దర్శకుడు రాజు కొలుసు దర్శకత్వంలో ఆమధ్య ఓ చిత్రం ప్రారంభమైంది. సగానికి పైగా షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే, అవుట్ పుట్ సరిగా రావడం లేదన్న ఉద్దేశంతో, చిత్ర నిర్మాణాన్ని ఆపేస్తున్నట్టు నిర్మాత భవ్య ఆనంద ప్రసాద్ ప్రకటించినట్టు సమాచారం.