'ఆకాశవాణి' సినిమా అప్ డేట్
- నిర్మాతగా రాజమౌళి తనయుడు కార్తికేయ
- దర్శకుడిగా అశ్విన్ గంగరాజు పరిచయం
- ప్రేక్షకులను థ్రిల్ చేసే కంటెంట్
ఇటీవలే 'పాడేరు' సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగు తెరపై ఈ సినిమా ఒక ప్రయోగమనీ .. ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని చెబుతున్నారు. తారాగణం పరంగా చిన్న సినిమాలా కనిపించినప్పటికీ. కావాల్సినంత కొత్తదనం ఉంటుందని చెబుతున్నారు. పెద్ద విజయాలను సాధించిన చిన్న సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.