కళ్లముందే నిజం కనిపిస్తున్నా ఇదంతా గ్రాఫిక్స్ అంటూ అబద్ధాలు చెబుతారా?: శివాజీ
- కళ్లముందు కనిపిస్తున్న నిజాన్ని చూడండి
- గ్రాఫిక్స్ అంటూ కట్టు కథలు
- 2021లో అద్భుతం ఆవిష్కారం
2020 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని టీడీపీ ప్రభుత్వం చెబుతోందని, అయితే, 2021 అక్టోబర్, నవంబరు నెలల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వేలాదిమంది రాత్రింబవళ్లు ఇక్కడ కష్టపడుతున్నారని, కళ్లముందే నిజం కనిపిస్తున్నా ఇదంతా గ్రాఫిక్స్ అంటూ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని శివాజీ మండిపడ్డారు. ఎవరి కుటుంబాన్ని బాగుచేయడం కోసం ఈ అబద్ధాలు చెబుతున్నారని ప్రశ్నించారు.