రష్మిక మందనకి బర్త్ డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ .. 'డియర్ కామ్రేడ్' ఫస్టుసాంగు రిలీజ్ డేట్ ఫిక్స్
- 'డియర్ కామ్రేడ్' గా విజయ్ దేవరకొండ
- ఈ నెల 8వ తేదీన ఫస్టు సాంగ్ రిలీజ్
- మే 31వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమా నుంచి ఫస్టు సాంగును ఈ నెల 8వ తేదీ(సోమవారం) ఉదయం 11 గంటల 11 నిమిషాలకి తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్న విషయాన్ని ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గాను .. రష్మిక క్రికెటర్ గాను కనిపించనుంది. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.