'బంగార్రాజు' కథానాయికగా నయనతార?
- నాగార్జున హీరోగా 'బంగార్రాజు'
- త్వరలోనే లాంచ్ చేసే అవకాశం
- ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగు
ఎన్నికలు పూర్తి కాగానే నాగార్జున తన సొంత బ్యానర్లో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని భావించిన కల్యాణ్ కృష్ణ .. తాజాగా ఆమెతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. గతంలో నాగ్ .. నయనతార కాంబినేషన్లో 'బాస్' .. 'గ్రీకువీరుడు' వచ్చిన సంగతి తెలిసిందే.