మైలవరం సభలో దేవినేని పూర్ణ మా కార్యకర్తలపై రాళ్లు, చెప్పులు విసిరి రెచ్చగొట్టాడు!: వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్
- మైలవరంలో అలజడులు సృష్టించేందుకు యత్నించారు
- వైసీపీ కార్యకర్తలను నేను సముదాయించాను
- పోలీసులు మాపైనే కేసులు పెడుతున్నారు
కానీ పోలీసులు మాత్రం వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు. టీడీపీ నేత దేవినేని ఉమ ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని కృష్ణప్రసాద్ హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో వైసీపీ విజయాన్ని ఆపలేరని జోస్యం చెప్పారు.