'దిమాక్ ఖరాబ్ .. ' అంటూ సాంగ్ అందుకున్న రామ్
- షూటింగు దశలో 'ఇస్మార్ట్ శంకర్'
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- మే నెలలో విడుదల
ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. 'దిమాక్ ఖరాబ్ ..' అంటూ సాగే పాటను రామ్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా .. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డిఫరెంట్ లుక్స్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమా, ఆయనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనేది అభిమానుల మాట.