అఖిల్ నాలుగవ సినిమా సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్
- లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- త్వరలోనే సెట్స్ పైకి
గత సినిమాల్లోని లోపాలను సవరించుకుంటూ అఖిల్ వెళుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. యూత్ కి .. మాస్ ఆడియన్స్ కు ఏ తరహా బీట్స్ ఇష్టమో దేవిశ్రీకి బాగా తెలుసు. అందువలన కథాపరంగా ఈ ప్రాజెక్టుకు ఆయననే తీసుకోవాలనే ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ వారు ఉన్నారట. సంప్రదింపులు జరుగుతున్నాయని .. దాదాపు దేవిశ్రీ ప్రసాద్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఇక అఖిల్ సక్సెస్ లో దేవిశ్రీ ఏ స్థాయి పాత్రను పోషిస్తాడో చూడాలి.