దక్షిణాదిపై కన్నేసిన రాహుల్ గాంధీ.. కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ!
- అమేథీ, వాయనాడ్ నుంచి పోటీ
- వివరాలు ప్రకటించిన ఏకే ఆంటోనీ
- కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వాయనాడ్
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వాయనాడ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎం.ఐ.షానవాజ్ ఇక్కడ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే గతేడాది ఆయన చనిపోవడంతో ఈ స్థానం ఖాళీగా ఉండిపోయింది.