టీడీపీకి బై చెప్పిన చిత్తూరు సీనియర్ నేత.. వైసీపీలో చేరిక
- ఊపందుకున్న జంపింగ్‌లు
- వైసీపీలో చేరేందుకు సిద్ధమైన నేతలు
- టీడీపీకి గుడ్‌బై చెప్పిన శ్రీరామ్మూర్తి
తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, శ్రీకాకుళం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ శ్రీరామ్మూర్తి కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. అనుకున్నదే తడవుగా ఆయన వెంటనే తన అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.