టీడీపీకి ఝులక్.. వైసీపీలో చేరిన ఎమ్మెల్యే మణిగాంధీ!
- కోడుమూరు సభలో వైసీపీ తీర్థం
- కండువా కప్పి ఆహ్వానించిన జగన్
- చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో నిర్ణయం
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మణిగాంధీ వైసీపీ టికెట్ పై గెలుపొందారు. అనంతరం టీడీపీలోకి ఫిరాయించారు. అయితే రాజకీయ సమీకరణాల్లో భాగంగా కోడుమూరు టికెట్ ను చంద్రబాబు బి.రామాంజనేయులుకు కేటాయించారు. దీంతో మనస్తాపం చెందిన మణిగాంధీ ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కోడుమూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న డా.సుధాకర్ బాబు మణిగాంధీకి స్వయానా తోడల్లుడు కావడం గమనార్హం.