'బ్రోచేవారెవరురా' నుంచి నివేదా థామస్ పోస్టర్
- కథానాయకుడిగా శ్రీవిష్ణు
- సినిమా నేపథ్యంలో సాగే కథ
- 'మిత్ర' పాత్రలో నివేదా థామస్
శ్రీవిష్ణు .. నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నివేద థామస్ పోస్టర్ ను వదిలారు .. 'మిత్ర' అనే పాత్రలో ఆమె కనిపించనుందంటూ పరిచయం చేశారు. సినిమా నేపథ్యంలోనే ఈ కథ కొనసాగుతుందనీ .. ఒక ఆర్టిస్ట్ గానే అందులో నివేద కనిపించనుందని ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ .. సత్యదేవ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.