కృష్ణా జిల్లాలో టీడీపీ ఎన్నికల ప్రచారంపై తేనెటీగల దాడి.. పరుగులు తీసిన కార్యకర్తలు!
- ముసునూరు మండలం గోగులంపాడులో ఘటన
- టీడీపీ నేత వెంకటేశ్వరరావు ప్రచారం సందర్భంగా దాడి
- పలువురు ఆసుపత్రిలో చేరిక
ఈ ఘటనలో అస్వస్థతకు లోనైన పలువురు టీడీపీ కార్యకర్తలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.