'చిత్రలహరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
- సాయితేజ్ నుంచి 'చిత్రలహరి'
- ఏప్రిల్ 12వ తేదీన విడుదల
- అందుకే మెగా హీరోలు దూరం
ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది. 'జనతా గ్యారేజ్' సమయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన వాళ్ల ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ రానున్నాడని అంటున్నారు. వాస్తవానికి ఈ వేడుకకి చిరంజీవిగానీ .. చరణ్ గాని ముఖ్య అతిథులుగా రావలసి ఉందట. అయితే ఏపీ ఎన్నికల్లో 'జనసేన' పోటీ చేస్తుండటంతో, మీడియాకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్లు రావడం లేదని చెప్పుకుంటున్నారు.