మోదుగులకు అక్కడ మాటల్లేవు.. ఇక్కడ చేతల్లేవు: గల్లా జయదేవ్ దెప్పిపొడుపు
- మైక్ పట్టుకుని ఘనకార్యంలా ఫీలవుతుంటారు
- మోదీని ప్రశ్నించిన వెంటనే ఈడీ నోటీసులు
- మోదీతో పోరాడి జైలుకు వెళ్లేందుకు సిద్ధం
అదే సమయంలో మోదుగుల గురించి మాట్లాడుతూ, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయనేం సాధించారో తెలపాలని సవాల్ చేశారు. పార్లమెంట్లో మైక్ పట్టుకుని అదేదో ఘనకార్యంలా ఫీలవుతుంటారని విమర్శించారు. మోదుగులకు అక్కడ మాటల్లేవని, ఇక్కడ చేతల్లేవని విమర్శించారు. తాను పార్లమెంటులో ప్రధాని మోదీని ప్రశ్నించిన వారంలోపే తనకు ఈడీ నోటీసులు పంపించిందన్నారు. హిట్లర్ వంటి మోదీతో పోరాడి తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని జయదేవ్ పేర్కొన్నారు.