నరేష్ వ్యాఖ్యలపై రాజశేఖర్ అసంతృప్తి!
- 'మా' అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నరేష్
- 'నేను' అన్న నరేష్ మాటలను తప్పుబట్టిన రాజశేఖర్
- 'మేము' అని మాట్లాడితే బాగుంటుందని హితవు
అ తర్వాత మళ్లీ జీవిత చేతిలో నుంచి మైక్ తీసుకుని... తాను మాట్లాడేందుకు చాలా ఉందని, ఓపిక ఉంటే వినవచ్చని రాజశేఖర్ అన్నారు. 'నేను' అని కాకుండా 'మేము' అని నరేష్ మాట్లాడాలని... ఈ కార్యక్రమానికి తాను రావాలనుకోలేదని, నరేష్ వచ్చి పిలిస్తేనే వచ్చానని, ఆయన తనకు మంచి మిత్రుడు కాబట్టే వచ్చానని చెప్పారు. ఇకపై నరేష్ 'మేము' అని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. పక్కనే ఉన్న నరేష్ కల్పించుకుని... తానేదో సరదాగా అన్నానని, మనమందరం కలిసే పని చేద్దామంటూ రాజశేఖర్ ను సముదాయించారు.