భారీ రేటుకు విజయ్ మూవీ శాటిలైట్ హక్కులు
- క్రీడా నేపథ్యంలో విజయ్ మూవీ
- అభిమానుల్లో భారీ అంచనాలు
- దీపావళికి భారీస్థాయి విడుదల
ఈ కారణంగా ఈ సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో ఛానల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి శాటిలైట్ హక్కులను సన్ టీవీ వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. శాటిలైట్ హక్కుల పరంగా కోలీవుడ్లో ఇంతవరకూ అత్యధిక రేటుకు అమ్ముడైన సినిమా ఇదేననే టాక్ అక్కడ బలంగా వినిపిస్తోంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నారు. విజయ్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే వుంది.