'కాప్పన్'లో తీవ్రవాదిగా కనిపించనున్న ఆర్య
- కేవీ ఆనంద్ నుంచి 'కాప్పన్'
- ప్రధానమంత్రిగా మోహన్ లాల్
- సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో సూర్య
ఈ సినిమాలో ఆర్య కూడా కీలకమైన రోల్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆయన పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలో తలెత్తింది. ఈ సినిమాలో ఆయన ప్రధానమంత్రిని హత్య చేయడానికి రంగంలోకి దిగిన ఒక తీవ్రవాదిగా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. కేవీ ఆనంద్ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడనీ, ఆర్య కెరియర్లో ఈ పాత్ర చెప్పుకోదగినది అవుతుందని అంటున్నారు. 'ఎన్జీకే' తరువాత ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.