ఆది సాయికుమార్ కొత్త సినిమా లాంచ్
- ఆది సాయికుమార్ నుంచి ద్విభాషా చిత్రం
- కథానాయికగా వేదిక
- ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్
కార్తీక్ విఘ్నేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో రూపొందనుంది. 'వేదిక' కథానాయికగా నటించనున్న ఈ సినిమాను ఈ రోజునే లాంచ్ చేశారు. కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి 'తలకోన'లో రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.