చక్రం కాదుకదా, కేసీఆర్ బొంగరం కూడా తిప్పలేరు!: లక్ష్మణ్ మండిపాటు
- మోదీని టార్గెట్ చేసుకున్న కేసీఆర్
- మాటల తీరు సరికాదని లక్ష్మణ్ ఆక్షేపణ
- మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపాటు
దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని చెప్పుకుంటున్న కేసీఆర్, పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ తొలి స్థానంలో ఉన్నామన్న విషయాన్ని అంగీకరించాలని అన్నారు. మిగులు బడ్జెట్ తో పుట్టిన తెలంగాణను, అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ దేనని ధ్వజమెత్తిన లక్ష్మణ్, కేవలం ఫామ్ హౌస్ కు, అక్కడి నుంచి ప్రగతి భవన్ కు పరిమితమైన కేసీఆర్, దేశ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని అన్నారు.