రీ ఎంట్రీ ఇస్తోన్న సీనియర్ హీరోయిన్ నిరోషా
- హీరోగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సుధాకర్
- అధికభాగం చిత్రీకరణ అమెరికాలో
- ఏప్రిల్ 26వ తేదీన విడుదల
ఈ సినిమాలో ఆమె పాత్ర వైవిధ్యభరితంగా .. పవర్ఫుల్ గా మలచబడిందని అంటున్నారు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన సుధాకర్ .. ఈ సినిమాలో హీరోగా చేశాడు. హరనాథ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధాకర్ జోడీగా నిత్యా శెట్టి నటించింది. కథాపరంగా ఈ సినిమా చిత్రీకరణ దాదాపు అమెరికాలోనే జరిగింది. అల్లు అరవింద్ .. బన్నీ వాసు కలిసి ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.