పెదనాన్నను ఎవరో దాడి చేసి చంపారు: వైఎస్ అవినాష్ సంచలన వ్యాఖ్యలు
- ఇది సహజమరణం కాదు
- తలపై బలమైన గాయాలున్నాయి
- లోతైన దర్యాప్తు జరపాలన్న అవినాష్
ఎవరో దాడి చేస్తేనే మరణించినట్టు స్పష్టంగా అర్ధమవుతోందని, తమకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనని అవినాష్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ వివేకా మృతిపై తక్షణం లోతైన దర్యాఫ్తును ప్రారంభించాలని కోరారు. కుట్రలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిన్నంతా మైదుకూరులో ప్రచారం నిర్వహించిన ఆయన, నేడు మరణించి వుండటమేంటని, పూర్తి ఆరోగ్యంతో నిన్న కనిపించిన మనిషి, నేడు మరణించడం ఏంటని, ఈ అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.