'సీతారామయ్యగారి మనవరాలు' సెట్లో 'రాస్కెల్.. గెటవుట్' అన్నారాయన!: 'పెళ్లి' పృథ్వీరాజ్
- క్రాంతికుమార్ గారు తొలి అవకాశం ఇచ్చారు
- నన్ను చూడగానే ఆయనకి కోపం వచ్చేసింది
- గెడ్డం కారణంగా ఛాన్స్ పోయింది
షూటింగు మొదలుకావడానికి కొన్ని రోజులముందు క్రాంతికుమార్ గారికి కనిపిస్తే, 'నీ గెడ్డం బాగుందయ్యా' అన్నారు. ఈ మధ్య షూటింగులేమీ లేవు కదా సార్ .. అందుకే పెంచాను' అన్నాను. ఆ తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఫస్టు డే నేను సెట్లోకి అడుగుపెడుతుండగానే క్రాంతికుమార్ గారు చూసి .. 'గెటవుట్ .. యు రాస్కెల్' అంటూ అరిచారు. నేను ఒక్కసారిగా బిత్తరపోతూ .. 'ఎవరిని సార్ ' అన్నాను. 'నిన్నే .. రాస్కెల్ .. నిన్ను ఎవరు గెడ్డం తీయమన్నారు? అన్నారు. 'అవసరమైతే గెడ్డం పెట్టుకోవచ్చు సార్' అన్నాను. ''ఫస్టు .. గెటవుట్' అంటూ మళ్లీ గట్టిగా అరిచారు. అలా గెడ్డం కారణంగా ఆ సినిమాలో ఛాన్స్ పోయింది .. అని చెప్పుకొచ్చారు.