సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రాయ్ లక్ష్మి చిత్రానికి సెన్సార్ పూర్తి
- మణిరత్నం చిత్రంలో కీలక పాత్రలో కార్తి
- హిందీలోకి వెంకటేశ్ హిట్ సినిమా
* ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించే చారిత్రాత్మక చిత్రం 'పొన్నియన్ సెల్వన్'లో హీరో కార్తి కూడా ఓ కీలక పాత్రకు తాజాగా ఎంపికయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలకు విక్రం, విజయ్ సేతుపతి, జయం రవిని తీసుకున్నారు. తమిళనాడును ఏలిన రాజరాజ చోళుని కథతో ఈ చిత్రం రూపొందనుంది.
* వెంకటేశ్, టబు జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1991లో వచ్చిన 'కూలీ నెం 1' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించే ఈ హిందీ వెర్షన్లో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది.